నా గురించి

      నా పేరుచెరుకువాడ సత్యనారాయణ‘. తెలిసున్నవాళ్ళు అందరూసి. యస్అనే పిలుస్తారు. నాకూ అదే అలవాటయిపోయింది. ఉద్యోగించినదీ (టెలికామ్ శాఖలో) నివాసముంటున్నదీ కాకినాడలో.

        రామచంద్రపురంలో చదువుకునే రోజుల్లోనే, పాత హిందీ సినిమా పాటలతో పాటు సంగీత, సాహిత్యాది అనేక రంగాల్లో అభిరుచి, ఆసక్తి కలిగించింది మా పెద్దమ్మ గారబ్బాయి, గురుతుల్యుడు కృష్ణ. రచనా వ్యాసంగంలో మెలకువలు నేర్పింది ప్రముఖ సినీ, నాటక, కథా రచయిత శ్రీ ఆకెళ్ళ.

         తెలుగు కథను ఆవిర్భావం నుండి ఎందరో రచయితలు తమ కథలనే నిచ్చెన మెట్ల మీదుగా ఉన్నత శిఖరాలకు చేర్చారు. అంతర్జాతీయ గుర్తింపు కూడా తీసుకొచ్చారు. ప్రేమానుబధాలు, మానవ సంబంధాలతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యల్ని ఇతివృత్తాలుగా తీసుకొని అద్భుతమైన కథలు సృష్టించారు. నేటికీ రాస్తూనే ఉన్నారు.

       అలాంటి కథల్లో కొన్ని కథలను, ముఖ్యంగా అరవై డెభ్భై ఏళ్ల క్రితం నుండి మొదలు పెట్టి, ఎంపిక చేసి, వాటి సారాంశాలని తరం పాఠకులకు పరిచయం చేయాలనే ఆలోచనతో మాధ్యమం ఎంచుకున్నాను. ఇందుకు నన్ను ప్రోత్సహించిన మా వాళ్ళందరికీ కృతజ్ఞతలు.!

-సి.యస్.