కథన కుతూహలం 60

ఈ తెలుగు కథానికా పరిచయ పరంపరలో ఇప్పుడు రాయబోయే కథతో 60 కథలు పూర్తవుతాయి. మన సంప్రదాయాన్ని అనుసరించి మానవ జీవితంలో 60 ఏళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని ‘షష్టిపూర్తి‘ అని పిలుచుకుంటారు. అది ఒక అకేషన్!    ఈ ప్రస్థానంలో ఏ ఆటంకమూ లేకుండా, ఏవిధమైన అంతరాయమూ కలుగకుండా ఈ కథల పరిచయానికి 60 కథల పరిచయంతో ‘షష్టిపూర్తి‘ నిండడం సంతోషం కలిగిస్తోంది. చదివి ఆదరిస్తున్న పాఠక మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ కథ తరువాత…

కథన కుతూహలం 59

నేను బి.కామ్. చదివే రోజుల్లో మా గురువర్యులు శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారు నాకు రకరకాల పుస్తకాలు చదవమని సూచిస్తూండేవారు. కొన్ని సందర్భాల్లో పుస్తకాలు ఆయనే ఇస్తూండేవారు. అలా ఓసారి నవీన్ రాసిన ‘అంపశయ్య‘ నవల ఇచ్చి చదవమన్నారు. విశ్వవిద్యాలయంలో ఇరవైనాలుగు గంటల్లో ఒక విద్యార్థి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఆ నవల. ‘చైతన్య స్రవంతి’ (Stream of consciousness) పద్ధతిలో రాసిన నవల అది. ఆ నవలతో నవీన్ కి ఎంత పెద్దపేరు వచ్చిందంటే,…

కథన కుతూహలం 58

ఒక కథకుడు కథను రాసేటప్పుడు తను ఏం చెప్పదలుచుకున్నాడో ఆ వస్తువు, తత్సంబంధమైన ఆలోచనలు,  భావోద్రేకాలూ అతని మనసులో ఉంటాయి.  కథ రాసి, అవే భావాలనీ, స్పందనలనీ ఆ కథను చదివిన పాఠకుల్లో తీసుకురాగలిగినప్పుడు అతడు మంచి కథకుడు అవుతాడు.  అలా తన మనసులో కదిలిన భావాలకి చక్కని చిక్కని కథనంతో అక్షరరూపం కల్పించి,  పాఠకులని తనతో తీసుకెళ్లగలిగిన శక్తిగల రచయితల్లో శ్రీకంఠమూర్తి ఒకరు.      శ్రీకంఠమూర్తిగారిని గురించిన విషయాలు ఎక్కడా దొరకటం లేదు. ‘కథానిలయం’లో వారి…

కథన కుతూహలం 57

1971లో ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీల్లో యం. రామకోటిగారి కథకి మొదటి బహుమతి వచ్చింది. ఆ కథ పేరు “శకటిక“.    అప్పుడు ఆ కథ చదివి, చాలా రోజులు దాన్ని గురించి ఆలోచించాను. రచయిత ఆ కథ రాసిన పద్ధతి, అందులో వాడిన ‘తూర్పు‘ యాస నాకు బాగా జ్ఞాపకముండిపోయింది. ఆ తరవాత రామకోటి గారి కథలు కొన్ని చదివినా ఈ ‘శకటిక‘ అనే కథ మాత్రం బాగా నన్ను వెంటాడింది. మళ్ళీ ఈ ‘కథన…

కథన కుతూహలం 56

   ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కథకుల కథలు ఇప్పటివరకూ చాలానే చదువుకున్నాం. ఎన్ని చదువుకున్నా ఇంకా చదవవలసిన ఆ ప్రాంతపు రచయితలు చాలామందే వున్నారు. అలాంటి వారినుంచి ఈ వారం శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారిని తీసుకున్నాను. శ్రీ సీతారామమూర్తి గారు 1947లో పొందూరులో జన్మించారు. వారు చిన్నతనం నుంచే కథలూ, కవిత్వమూ, నాటికలూ రాయడం మొదలుపెట్టారు.  తెలుగునాట ఉన్న అన్ని పత్రికలలో వారి కథలు దాదాపు 200 పైనే ప్రచురితమయ్యాయి. తొమ్మిది సార్లు వారు…

కథన కుతూహలం 55

          మహా కవులని పేరు పొందిన వారిలో కొందరు కథలూ, నవలలూ కూడా రాసి, మంచి కథా/ నవలా రచయితలుగా పేరు పొందేరు.  విశ్వనాథ, శ్రీశ్రీ, అడివి బాపిరాజు వంటివారెందరో ఈ కోవలోకి వస్తారు. అటువంటి వారిలో  ‘గౌతమీ కోకిల’ శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారిని కూడా ప్రముఖులుగా చెప్పుకోవచ్చు.  వీరికి  ‘మహాకవి’ అనే బిరుదు ఉంది.           వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు 1900 సంవత్సరంలో పుట్టేరు. సంస్కృతాంధ్ర భాషల్లో మంచి ప్రావీణ్యమున్న వీరు…

కథన కుతూహలం 54

యర్రంశెట్టి శాయి — ఈ పేరు వినగానే అందరికీ ఆయన రాసిన హాస్య కథలు గుర్తుకొస్తాయి. పాఠకులకి శాయి ఒక వ్యంగ్య , హాస్య రచయితగా బాగా తెలుసు. నిజానికి ఆయన ఎక్కువగా అలాంటి కథలే రాశారు కూడా. కానీ ఆయన సెంటిమెంటుతో కూడిన కథలూ, మధ్యతరగతి వారి జీవితాలను ప్రతిబింబించే కథలూ కూడా చాలానే రాశారు. వివిధ వార, మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు పైగా వీరివి ప్రచురితమయ్యాయి. వీరు రైల్వేలో ఉద్యోగం…

కథన కుతూహలం 53

క్రిందటి వారం రామచంద్రపురానికి చెందిన శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి కథ పరిచయం చేసుకున్నాం. ఈ వారం ఆ పక్కనే ఉన్న ద్రాక్షారామకి చెందిన డాక్టరు. దవులూరి శ్రీకృష్ణ మోహనరావుగారి కథ పరిచయం చేస్తాను. శ్రీకృష్ణ మోహనరావు గారిని గురించిన వివరాలు ఎక్కువగా తెలియడం లేదు గానీ, గోదావరి జిల్లా యాసలో మంచి కథలు రాసినవారిలో ఈయన ఒకరు. ఈయన 1939 వ సంవత్సరంలో ద్రాక్షారామంలో పుట్టారు. పెరిగినది కూడా అక్కడే. వారు వైద్య విద్యనభ్యసించారు. డాక్టరుగా…

కథన కుతూహలం 52

మా రామచంద్రపురం (తూ: గో: జిల్లా) నుంచి కళా సాహిత్య రంగాలలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. రామచంద్రపురం తాలూకా (అప్పట్లో ఆలమూరు కూడా రామచంద్రపురం తాలుకానే) తెలుగు వారికి గర్వకారణమైన ఎందరో సాహిత్యవేత్తలని అందించింది. అలాగే మహాకథకులు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి స్వంత ఊరు పొలమూరు కూడా రామచంద్రపురం తాలూకా లోనిదే. ఇక రామచంద్రపురం పేరు చెప్పగానే సాహిత్య రంగంలో అందరికీ ముందుగా జ్ఞాపకం వచ్చే పేరు శ్రీ ఇంద్రగంటి హనుమమచ్ఛాస్త్రి గారు….

కథన కుతూహలం 51

కథలు రాయడానికి రచయితలకి ప్రేరణ– ఈ సమాజమే. మన చుట్టూ ఉన్న వ్యక్తులనీ, జరిగే సంఘటనలనీ, వినిపించే సంగతులనీ తన రచనలకి ముడిసరుకుగా తీసుకుంటాడు రచయిత. అవే సంఘటనలు మాములువాళ్ళు ఏదో వార్త కింద చూసి వదిలేస్తారు. అదే కథకుడైతే, దాన్ని కథగా మలచడానికి కావలసిన సరంజామా చేర్చి, పాఠకుడికి చదివే ఆసక్తి కలిగించేలా తీర్చి దిద్దుతాడు. ఆ రచనలో సందేశముండడమే కాదు చదివినవారిలో స్ఫూర్తి కూడా నింపుతుంది. అప్పుడు అది మంచి కథగా మన్నన పొందుతుంది….