కథన కుతూహలం 50

ఈ కథల పరిచయ పరంపరలో ఇది 50 వ కథ. ఈకథని కూడా కలుపుకుంటే ఇప్పటిదాకా 49 మంది రచయితల కథలు చదువుకున్నాము. ( బుచ్చిబాబు గారివి రెండు కథలు కనక) కథలన్నీ చదివి చాలామంది కామెంట్ రూపంలోనూ, వాట్సాప్ ద్వారానూ తమ అభిప్రాయాలను తెలియచేస్తూ వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. 50 వారాలు ఎంత వేగంగానో జరిగిపోయాయి. ఈ వారం తెలుగు భాషకు ఎన్నో సొగసులు, జిలుగులు అద్ది, కొత్త అందాలు కూర్చిన శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి…

కథన కుతూహలం 49

1950 లలో మొదలుపెట్టి, 50 ఏళ్లకు పైగా వందలాది కథలు రాసి, పది కథా సంపుటాలు వెలువరించి, తెలుగునాట మంచి కథకులలో ఒకరుగా పేరుపొందినవారు శ్రీ శ్రీపతి. వీరి కథలు చదువుతోంటే అవి కథలుగా కనిపించవు. కొన్ని జీవిత వాస్తవాలు మనముందు పరిచినట్టుగా ఉంటాయి. మానవ స్వభావాన్ని విశ్లేషించినట్టుగా తోస్తుంది. సముద్రాన్ని, కొండలని, నదుల్నీ, కాలవలనీ పచ్చటి పంటపొలాలనీ కళ్ళముందు నిలిపినట్టు ఉంటుంది. చిన్న చిన్న వాక్యాలతో, కవితాత్మకంగా అందమైన పద చిత్రాలు గీసినట్టుంటుంది. శ్రీపతిగారి అసలు…

కథన కుతూహలం 48

తన తండ్రిలాగే రాసినవి తక్కువ కథలే అయినా , తీసుకున్న కథా వస్తువు, శిల్పము, తాత్త్వికసందేశం మొదలైన విషయాల్లో కూడా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రముఖ కథా రచయిత్రి చాగంటి తులసి గారు. ఆమె ప్రఖ్యాత కథకుడు శ్రీ చాగంటి సోమయాజులు గారి కుమార్తె. ” నాకు సోమయాజుల కథల కంటే తులసి కథలే నచ్చుతాయి” అని శ్రీ రోణంకి అప్పలస్వామి వంటి వారిచే ప్రశంసలు అందుకున్న రచయిత్రి ఆమె. చిన్నతనం నుంచీ ఆమె సాహిత్య వాతావరణంలోనే…

కథన కుతూహలం 47

మీకిప్పుడు పరిచయం చెయ్యబోయే కథను రాసినవారు చాలామందికి తెలియని లేదా మరిచిపోయిన రచయిత. వీరు 1954 నుంచి వివిధ ప్రముఖ పత్రికల్లో కథలు రాసి బహుమతులు పొందినవారే! ఆయన రాసిన ” ఊరు నిద్రపోయింది” అనే కథకు ‘ఆంధ్ర సచిత్ర వారపత్రిక‘ వారి 1956 సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. ఇంతకీ వీరి పేరు శ్రీ వై. రఘునాథరావు. రఘునాథరావుగారు 1930 లో జన్మించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి కెమికల్ , సివిల్…

కథన కుతూహలం 46

వయసు మీదపడ్డా విడవకుండా పోటీలకి కూడా ఉత్సాహంగా కథలు రాస్తోన్న ప్రముఖ కథకులు కొందరున్నారు. అలాంటివారిలో శ్రీ పి. యస్. నారాయణగారు ఒకరు. పి. యస్. నారాయణ అనే పేరుతో 250 కి పైగా కథలూ, 31 నవలలూ, 10 రేడియో నాటికలు, ఇంకా అనేక విమర్శనా వ్యాసాలూ రాసిన ఆయన పూర్తి పేరు– పొత్తూరి సత్యనారాయణ. వారు 1938 లో గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. బాల్యం లోనే తల్లిదండ్రులు మరణించడంతో పెద్దక్కయ్యగారి వద్ద పెరిగారు….

కథన కుతూహలం 45

క్రిందటి వారం పరిచయం చేసిన ‘చంద్రవంక ‘ కథలో నీటివాగు పొంగి , విలయతాండవం చేస్తూ ఊరంతటినీ ముంచెత్తిన వైనం చూశాం. నిలువెత్తున నిలిచిన నీటినుంచి కాపాడుకోడానికి ప్రజలు పడ్డ అగచాట్లు చూశాం! ఈ వారం పరిచయం చేస్తూన్న శ్రీ కాళీపట్నం రామారావుగారి ” జీవధార” కథలో , నీటికి కటకటలాడిపోవడం అంటే ఎలా ఉంటుందో, ప్రజలు నీటికోసం పడే తిప్పలేమిటో చూస్తాం. అన్నీ సమంగా సమకూరి నప్పుడే కదా….మనిషి సుఖంగా బతకగలిగేది! కా. రా మాస్టారుగా…

కథన కుతూహలం 44

తెలుగు కథలపై ‘కథానిక — స్వరూప స్వభావాలు‘ అనే సిద్ధాంత వ్యాసం రాసి, మొట్టమొదట పి.హెచ్.డి. చేసిన రచయిత- శ్రీ పోరంకి దక్షిణామూర్తి. తెలుగునేలలోని మూడు ప్రాంతాల మాండలికాల్లోనూ నవలలు రాసినవారూ పోరంకి వారే! ‘మాండలిక వృత్తిపదకోశం‘ , ‘తెలుగు — ఇంగ్లీషు నిఘంటువు‘ అనే పుస్తకాలు వీరి సంపాదకత్వంలో వచ్చాయి. అంతేకాదు…. హిందీ, ఇంగ్లీషు నుంచి అనేక గ్రంధాలు అనువాదం చేశారు. మనందరికీ బాగా పరిచయమున్న ” ఒకయోగి ఆత్మకథ” (Autobiography of a Yogi)…

కథన కుతూహలం 43

ప్రారంభించింది మొదలు నిరాటంకంగా ఆరున్నర దశాబ్దాలకు పైన అలుపెరుగని సాహితీ వ్యవసాయం చేసి , వైవిధ్య భరితమైన ఎన్నో రచనలు పండించిన ‘భూమిపుత్రి‘ శ్రీమతి మాలతీ చందూర్. ఆమె పేరు చెప్పగానే దాదాపు యాభై ఏళ్ళపాటు ఆమె స్త్రీల కోసం నిర్వహించిన ‘ప్రమదావనం‘ శీర్షిక గుర్తుకొస్తుంది. అందులో స్త్రీల కోసం వంటా-వార్పు , అందాలూ-అలంకారాలు కాకుండా అనేకమంది సమస్యలకి ‘ జవాబులు‘ అందించేవారు. వాటిని మగవారు కూడా చాలా ఆసక్తిగా చదివేవారు. ఆ జవాబులు చదవడమే గొప్ప…

కథన కుతూహలం 42

తెలుగులో వందల సంఖ్యలో కథలు వ్రాసిన రచయిత్రులలో శ్రీమతి ఐ. వి. యస్. అచ్యుతవల్లి ఒకరు. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. 1960 ల నుంచి 2000 వరకూ చాలా విస్తృతంగా కథలూ, నవలలూ రాసిన ఈ విదుషీమణి తెలుగు సాహత్యరంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. పుట్టడం పశ్చిమగోదావరి జిల్లా– ఉంగుటూరు మండలం– దొంతవరం లోనైనా, పెరగడం, విద్యాభ్యాసం… అంతా కాకినాడలో అమ్మమ్మా, తాతయ్యల ఇంట్లోనే. ఆమె బి. ఎ. డిగ్రీతో పాటు హిందీలో ‘విశారద‘ చేశారు. సంస్కృతంలో…

కథన కుతూహలం 41

ఈ నెల 21 వ తేదీ, సోమవారం నాడు (21-05-2018) తెలుగు నవలా రచయిత్రులలో తార ( స్టార్ రైటర్) అనదగిన శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ‘కుపర్టినో ‘ పట్టణంలో ఆమె కూతురు ఇంటిదగ్గర ఆకస్మికంగా మరణించారు. ఆ వార్త విన్న తెలుగు పాఠక లోకంలో తీవ్ర విషాదం నెలకొంది. అత్యంత అధిక సంఖ్యలో పాఠకులు అభిమానులుగా కలిగిన శ్రీమతి సులోచనారాణి ‘నవలారాణి’గా ప్రసిద్ధి పొందారు. కౌమార దశలోనూ, యౌవనపు తొలి రోజులలోనూ…