కథన కుతూహలం 64

       ఈ పరిచయ పరంపరలో ఇంతకుముందు కొందరు రచయిత్రుల కథలను చదువుకున్నాం.  అందమైన ప్రేమ కథలతో పాటు,  మానవ సంబంధాల పైనా, స్త్రీలు ఎదుర్కొనే అనేకానేక సమస్యల పైనా,  అలాగే సామాజిక అంశాలపైనా స్త్రీలు అద్భుతమైన కథలు, నవలలూ రాశారు. అయితే , తాత్వికతతోనూ, మానసిక విశ్లేషణతోనూ కూడుకొన్న విషయాలతో కథలు రాసిన రచయిత్రులు మనకి తక్కువగానే ఉన్నారు. అలాంటి రచనలు చేసి పాఠకులను ఒప్పించిన రచయిత్రి శ్రీమతి జలంధర.

కథన కుతూహలం 63

గోదావరి గాలి సోకినా , గోదావరి నీళ్ళు తాగినా , ఆ ప్రాంతపు మట్టి వాసన పీల్చినా చాలు… ఆ గోదారి కెరటాల్లా హృదయంలో ఏవేవో అనుభూతులు చెలరేగుతాయి. ఆ అనుభూతులని ఒడిసి పట్టి, వాటిని అందమైన భావాలుగా కవిత్వీకరించో, కథలుగా మార్చో ఎందరో కవులూ ,రచయితలూ తమతమ సాహితీ కేదారాలను సస్యశ్యామలం చేశారు. నేటికీ గోదావరీ నది కేంద్రంగా తెలుగులో అనంతమైన సాహితీ రసఝరి నాలుగు దిక్కులా ప్రవహిస్తూనే ఉంది. ఒకరా… ఇద్దరా..? ఎందరి పేర్లు…

కథన కుతూహలం 62

తెలుగులో హాస్య కథలు సృష్టించిన తొలితరం కథకుల్లో శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు ఒకరు. అంతకుముందు ప్రహసనాలుగానూ, పద్యాలుగానూ, లేదా పానుగంటి వారి జంఘాల శాస్త్రి వంటి పాత్రలు ద్వారానూ, చిలకమర్తి వారి గణపతి వంటి నవలల ద్వారానూ హాస్య రచనలు వెలువడినా, శ్రీయుతులు భమిడిపాటి కామేశ్వరరావు గారు, మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, మునిమాణిక్యం నరసింహారావు గార్ల కథలతో తెలుగులో హాస్య రసం కొత్త పుంతలు తొక్కింది. సునిశితమైన హాస్యాన్ని పాఠకులు ఆస్వాదించడం మొదలు పెట్టేరు.

కథన కుతూహలం 61

‘ కథన కుతూహలం’ లోని కథలు చదువుతోన్న సహృదయ పాఠక మిత్రులకు నమస్కారాలు. వివిధ రచయితల 60 కథల పరిచయం నిరాఘాటంగా చేసిన తరువాత కొద్ది విరామం తీసుకోవడం జరిగింది.  ఈ ఆదివారం (25-11-2018) తిరిగి మరో కథతో మీ ముందుకొస్తున్నాను. ఇకనుంచి వారం వారం కాకుండా ప్రతి పదిహేను రోజులకొక కథ పెడదామని అనుకుంటున్నాను. అంటే పక్షానికి ఒక కథ అన్నమాట. పరిచయం చెయ్యవలసిన కథలు చాలా ఉన్నా, కొన్ని పని ఒత్తిడుల వల్ల ఈ…