కథన కుతూహలం 64

       ఈ పరిచయ పరంపరలో ఇంతకుముందు కొందరు రచయిత్రుల కథలను చదువుకున్నాం.  అందమైన ప్రేమ కథలతో పాటు,  మానవ సంబంధాల పైనా, స్త్రీలు ఎదుర్కొనే అనేకానేక సమస్యల పైనా,  అలాగే సామాజిక అంశాలపైనా స్త్రీలు అద్భుతమైన కథలు, నవలలూ రాశారు. అయితే , తాత్వికతతోనూ, మానసిక విశ్లేషణతోనూ కూడుకొన్న విషయాలతో కథలు రాసిన రచయిత్రులు మనకి తక్కువగానే ఉన్నారు. అలాంటి రచనలు చేసి పాఠకులను ఒప్పించిన రచయిత్రి శ్రీమతి జలంధర.

కథన కుతూహలం 63

గోదావరి గాలి సోకినా , గోదావరి నీళ్ళు తాగినా , ఆ ప్రాంతపు మట్టి వాసన పీల్చినా చాలు… ఆ గోదారి కెరటాల్లా హృదయంలో ఏవేవో అనుభూతులు చెలరేగుతాయి. ఆ అనుభూతులని ఒడిసి పట్టి, వాటిని అందమైన భావాలుగా కవిత్వీకరించో, కథలుగా మార్చో ఎందరో కవులూ ,రచయితలూ తమతమ సాహితీ కేదారాలను సస్యశ్యామలం చేశారు. నేటికీ గోదావరీ నది కేంద్రంగా తెలుగులో అనంతమైన సాహితీ రసఝరి నాలుగు దిక్కులా ప్రవహిస్తూనే ఉంది. ఒకరా… ఇద్దరా..? ఎందరి పేర్లు…

కథన కుతూహలం 62

తెలుగులో హాస్య కథలు సృష్టించిన తొలితరం కథకుల్లో శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు ఒకరు. అంతకుముందు ప్రహసనాలుగానూ, పద్యాలుగానూ, లేదా పానుగంటి వారి జంఘాల శాస్త్రి వంటి పాత్రలు ద్వారానూ, చిలకమర్తి వారి గణపతి వంటి నవలల ద్వారానూ హాస్య రచనలు వెలువడినా, శ్రీయుతులు భమిడిపాటి కామేశ్వరరావు గారు, మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, మునిమాణిక్యం నరసింహారావు గార్ల కథలతో తెలుగులో హాస్య రసం కొత్త పుంతలు తొక్కింది. సునిశితమైన హాస్యాన్ని పాఠకులు ఆస్వాదించడం మొదలు పెట్టేరు.

కథన కుతూహలం 61

‘ కథన కుతూహలం’ లోని కథలు చదువుతోన్న సహృదయ పాఠక మిత్రులకు నమస్కారాలు. వివిధ రచయితల 60 కథల పరిచయం నిరాఘాటంగా చేసిన తరువాత కొద్ది విరామం తీసుకోవడం జరిగింది.  ఈ ఆదివారం (25-11-2018) తిరిగి మరో కథతో మీ ముందుకొస్తున్నాను. ఇకనుంచి వారం వారం కాకుండా ప్రతి పదిహేను రోజులకొక కథ పెడదామని అనుకుంటున్నాను. అంటే పక్షానికి ఒక కథ అన్నమాట. పరిచయం చెయ్యవలసిన కథలు చాలా ఉన్నా, కొన్ని పని ఒత్తిడుల వల్ల ఈ…

కథన కుతూహలం 60

ఈ తెలుగు కథానికా పరిచయ పరంపరలో ఇప్పుడు రాయబోయే కథతో 60 కథలు పూర్తవుతాయి. మన సంప్రదాయాన్ని అనుసరించి మానవ జీవితంలో 60 ఏళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని ‘షష్టిపూర్తి‘ అని పిలుచుకుంటారు. అది ఒక అకేషన్!    ఈ ప్రస్థానంలో ఏ ఆటంకమూ లేకుండా, ఏవిధమైన అంతరాయమూ కలుగకుండా ఈ కథల పరిచయానికి 60 కథల పరిచయంతో ‘షష్టిపూర్తి‘ నిండడం సంతోషం కలిగిస్తోంది. చదివి ఆదరిస్తున్న పాఠక మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ కథ తరువాత…

కథన కుతూహలం 59

నేను బి.కామ్. చదివే రోజుల్లో మా గురువర్యులు శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారు నాకు రకరకాల పుస్తకాలు చదవమని సూచిస్తూండేవారు. కొన్ని సందర్భాల్లో పుస్తకాలు ఆయనే ఇస్తూండేవారు. అలా ఓసారి నవీన్ రాసిన ‘అంపశయ్య‘ నవల ఇచ్చి చదవమన్నారు. విశ్వవిద్యాలయంలో ఇరవైనాలుగు గంటల్లో ఒక విద్యార్థి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఆ నవల. ‘చైతన్య స్రవంతి’ (Stream of consciousness) పద్ధతిలో రాసిన నవల అది. ఆ నవలతో నవీన్ కి ఎంత పెద్దపేరు వచ్చిందంటే,…

కథన కుతూహలం 58

ఒక కథకుడు కథను రాసేటప్పుడు తను ఏం చెప్పదలుచుకున్నాడో ఆ వస్తువు, తత్సంబంధమైన ఆలోచనలు,  భావోద్రేకాలూ అతని మనసులో ఉంటాయి.  కథ రాసి, అవే భావాలనీ, స్పందనలనీ ఆ కథను చదివిన పాఠకుల్లో తీసుకురాగలిగినప్పుడు అతడు మంచి కథకుడు అవుతాడు.  అలా తన మనసులో కదిలిన భావాలకి చక్కని చిక్కని కథనంతో అక్షరరూపం కల్పించి,  పాఠకులని తనతో తీసుకెళ్లగలిగిన శక్తిగల రచయితల్లో శ్రీకంఠమూర్తి ఒకరు.      శ్రీకంఠమూర్తిగారిని గురించిన విషయాలు ఎక్కడా దొరకటం లేదు. ‘కథానిలయం’లో వారి…

కథన కుతూహలం 57

1971లో ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీల్లో యం. రామకోటిగారి కథకి మొదటి బహుమతి వచ్చింది. ఆ కథ పేరు “శకటిక“.    అప్పుడు ఆ కథ చదివి, చాలా రోజులు దాన్ని గురించి ఆలోచించాను. రచయిత ఆ కథ రాసిన పద్ధతి, అందులో వాడిన ‘తూర్పు‘ యాస నాకు బాగా జ్ఞాపకముండిపోయింది. ఆ తరవాత రామకోటి గారి కథలు కొన్ని చదివినా ఈ ‘శకటిక‘ అనే కథ మాత్రం బాగా నన్ను వెంటాడింది. మళ్ళీ ఈ ‘కథన…

కథన కుతూహలం 56

   ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కథకుల కథలు ఇప్పటివరకూ చాలానే చదువుకున్నాం. ఎన్ని చదువుకున్నా ఇంకా చదవవలసిన ఆ ప్రాంతపు రచయితలు చాలామందే వున్నారు. అలాంటి వారినుంచి ఈ వారం శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారిని తీసుకున్నాను. శ్రీ సీతారామమూర్తి గారు 1947లో పొందూరులో జన్మించారు. వారు చిన్నతనం నుంచే కథలూ, కవిత్వమూ, నాటికలూ రాయడం మొదలుపెట్టారు.  తెలుగునాట ఉన్న అన్ని పత్రికలలో వారి కథలు దాదాపు 200 పైనే ప్రచురితమయ్యాయి. తొమ్మిది సార్లు వారు…

కథన కుతూహలం 55

          మహా కవులని పేరు పొందిన వారిలో కొందరు కథలూ, నవలలూ కూడా రాసి, మంచి కథా/ నవలా రచయితలుగా పేరు పొందేరు.  విశ్వనాథ, శ్రీశ్రీ, అడివి బాపిరాజు వంటివారెందరో ఈ కోవలోకి వస్తారు. అటువంటి వారిలో  ‘గౌతమీ కోకిల’ శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారిని కూడా ప్రముఖులుగా చెప్పుకోవచ్చు.  వీరికి  ‘మహాకవి’ అనే బిరుదు ఉంది.           వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు 1900 సంవత్సరంలో పుట్టేరు. సంస్కృతాంధ్ర భాషల్లో మంచి ప్రావీణ్యమున్న వీరు…